రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది: నటి

6 Jul, 2019 15:00 IST|Sakshi

బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆమె తాజా చిత్రం ‘వన్‌ డే: జస్టిస్‌ డెలివర్డ్‌’ విడుదల కావడంతో గత రాత్రి స్నేహితులతో సంతోషంగా గడిపారు. అయితే, ఈ వేడుకలు అనుకున్నంత ఆనందంగా ముగియలేదని తెలుస్తోంది. ఓ హోటల్‌ యాజమాని తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె సోషల్‌ మీడియాలో తెలిపారు. రోహిత్‌ విగ్‌ అనే వ్యక్తి ప్రవర్తించన తీరు ఎంత క్రూరంగా ఉందని, తనకెంతో అసౌకర్యంగా, అభద్రంగా అనిపించిందని ఆమె వెల్లడించారు.  తన చుట్టు ఇద్దరు గార్డులు ఉన్నా.. అతను స్వైరవిహారం చేశాడని, అలాంటివాళ్లు నాశనమవ్వాలని, అతని ప్రవర్తన వల్ల తాను రేప్‌కు గురవుతున్నట్టు అనిపించిందని పేర్కొన్నారు. 

‘నాలాంటి ఒక మహిళ దేశంలో అభద్రతకు గురైతే.. ఇక సామాన్య మహిళల పరిస్థితేమిటి? ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నా పక్కనే ఉన్నా రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది. రోహిత్‌ విగ్‌ నువ్వొక స్వైరంలా ప్రవర్తించావు. నువ్వు నాశనమవ్వాలి’ అని ఈషా గుప్తా పేర్కొన్నారు. రోహిత్‌ విగ్‌ లాంటి వారి వల్లే మహిళలు ఎక్కడైనా అభద్రతా భావానికి లోనవుతారని, గుచ్చిగుచ్చి చూస్తూ చూపులతోటే రేప్‌ చేసేలా అతడు కనిపించాడని, ఫ్యూచర్‌ రేపిస్ట్‌లా కనిపిస్తున్న అతను ఎవరో మీకు తెలుసా? అంటూ తన సోషల్‌ మీడియా పేజీల్లో పేర్కొన్నారు. తెలుగులో ‘వినయ విధేయ రామ’ సినిమాలో రాంచరణ్‌ సరసన ప్రత్యేక గీతంలో నర్తించిన ఈషా గుప్తా బాలీవుడ్‌లో ‘టోటల్‌ ధమాల్‌’, ‘రుస్తుం’ వంటి సినిమాల్లో నటించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌