నటి విడాకులపై ఆమె తండ్రి ఏమన్నారంటే..!

17 Jan, 2017 18:21 IST|Sakshi
నటి విడాకులపై ఆమె తండ్రి ఏమన్నారంటే..!

లాస్‌ఏంజిల్స్‌:  గత ఏడాది హాలీవుడ్‌ జంట బ్రాడ్‌పిట్‌-ఏంజెలీనా జోలీ విడాకులు తీసుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 2016లో ఎక్కవగా చదివిన వార్త వీరి డైవర్స్‌కు సంబంధించింది కావడం గమనార్హం. అయితే కూతురు ఏంజెలీనా జోలీ- అల్లుడు బ్రాడ్‌పిట్ విడాకులు తీసుకోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని నటి తండ్రి జాన్ వోయిట్ తెలిపారు. బ్రాంజెలీనా(బ్రాడ్‌పిట్-ఏంజెలీనా జోలీ)ల విడాకులు తీసుకున్న తర్వాత  ఆయన తొలిసారి మీడియాతో(యూఎస్ మ్యాగజీన్) మాట్లాడారు. పిల్లల కోసమైనా వారు కలిసి ఉండాలని, వారి బాగోగులు ఇద్దరూ కలిసి చూసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వీలైతే విడాకుల విషయాన్ని పక్కపపెట్టి మళ్లీ భార్యాభర్తలుగా ఉండాలని జోలీ తండ్రి, సీనియర్ నటుడు జాన్ వోయిట్ అభిప్రాయపడ్డారు.

ఈ జనవరి 9న తమ విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలను వ్యక్తిగతంగా ఉంచాలనుకున్నట్లు ఈ జంట తెలిపింది. చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓ ప్రైవేట్‌ జడ్జిని నియమించుకోవాలని వారు భావిస్తున్నారు. బ్రాంజెలీనా దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే పిల్లల సంరక్షణ విషయంపై కూతురు, అల్లుడు మధ్య విభేదాలున్నాయని, వాటిని పక్కనపెట్టి తన మనవళ్లు, మనవరాళ్ల కోసమైనా మళ్లీ ఒకటిగా ఉండాలని జాన్ వోయిట్ ఈ సందర్భంగా వారికి సూచించాడు. మరోవైపు పిల్లలను తన వద్దే ఉంచాలని జోలీ కోరుకుంటుండగా, పిట్‌ మాత్రం సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా