నటి ఫోన్‌ హ్యాక్‌.. ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌

24 Jan, 2019 15:10 IST|Sakshi

మొన్న అక్షరా హాసన్‌.. నిన్న అమీ జాక్సన్‌.. నేడు హన్సిక మోత్వాని.. ఏంటనుకుంటున్నారా హ్యాకింగ్‌ బాధితులు. అవును నటి హన్సిక ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది. దాంతో ఆమె ప్రైవేట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. హన్సిక ఫోన్‌ని హ్యాక్‌ చేసిన వ్యక్తులు ఆమె టూ పీస్‌ బికినీ ధరించి తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు హన్సిక.

పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ‘నా ఫోన్‌, ట్విటర్‌ అకౌంట్‌ రెండు హ్యాక్‌ అయ్యాయి. ప్రస్తుతం నా బ్యాక్‌ ఎండ్‌ టీమ్‌ దీని గురించి పని చేస్తోంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నా ట్విటర్‌ ఖాతాలో వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి అంటూ హన్సిక ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తున్నారు. ఇది హన్సిక నటిస్తున్న 50వ చిత్రం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు