నాకు పెళ్లా..వరుడు ఎవరు!

13 Jun, 2020 08:15 IST|Sakshi

నటి హన్సిక పెళ్లంట! ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. నటుడు ధనుష్‌కు జంటగా మాప్పిళ్లై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత బుల్లి కుష్బూ గా ముద్ర వేసుకుని పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అదే విధంగా తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న హన్సిక ప్రస్తుతం కోలీవుడ్లో మహా, పార్ట్నర్‌ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీకి సక్సెస్‌ లు దూరం అయ్యాయని చెప్పాలి. తన 50వ చిత్రం మహా నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోంది. అదేవిధంగా అవకాశాలు హన్సికకు తగ్గుముఖం పట్టాయి.

ఈ నేపథ్యంలో ఈ ముంబాయి భామ పెళ్లికి రెడీ అవుతున్నారని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త పెళ్లాడబోతున్న టు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంతే కాదు మరో రెండు రోజుల్లోనే పెళ్లి అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె అభిమానులు కాస్తంత షాక్‌ కు గురవుతున్నారు అయితే ఈ ప్రచారంపై స్పందించిన నటి హన్సిక ఎవరబ్బా ఆ పారిశ్రామికవేత్త నాకే తెలియదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా తనకు పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 

చదవండి: భయంతో జీవితాన్ని గడపాలనుకోవడం లేదు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు