ఫైర్‌ బ్రాండ్‌.. హేమ

25 Jul, 2019 20:54 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పదో పార్టిసిపెంట్‌గా ప్రముఖ నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలులో జన్మించిన హేమ.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. దాదాపు 250కి పైగా నటించిన చిత్రాల్లో నటించిన హేమ.. భిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది హేమ.

సినిమాల్లోనే కాదు రాజకీయంలోనూ అడుగుపెట్టిన హేమ.. ఓటమి (మండపేట నియోజకవర్గం-2014) తరువాత మళ్లీ సినిమా రంగంలోనే కొనసాగింది. మా(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో వివాదాస్పదమవుతూ ఫైర్‌ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం ఉన్న హేమ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిక్కచ్చిగా ఉండే హేమ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు