నాకు ఇద్దరిపై ప్రేమ పుట్టింది : కాజల్‌

14 Mar, 2018 08:43 IST|Sakshi
 నటి కాజల్‌ అగర్వాల్(ఫైల్‌)

సాక్షి, సినిమా :  నటి కాజల్‌ అగర్వాల్ ఇద్దరిపై నాకు ప్రేమ పుట్టింది అని చెప్పుకొచ్చింది‌. నటనను పక్కా ప్రొఫెషనల్‌గా భావించే ఈ బ్యూటీకీ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. తెలుగులో ఎంఎల్‌ఏ అనే చిత్రంతో పాటు తమిళంలో హిందీ రీమేక్‌ ప్యారిస్‌ ప్యారిస్‌ అనే రెండు చిత్రాలే చేతిలో ఉన్నాయి. మూడు పదుల వయసు దాటిన ఈ అమ్మడికి ఇంకా పెళ్లి ఆలోచన రాలేదట. అయితే కాజల్‌ చెల్లెలు నిషా ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిలైపోయిందన్నది గమనార్హం. దీంతో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు ఆమె ఏం బదులిచ్చిందో చూద్దాం. నేను ఎక్కడికి వెళ్లినా ఎవరినైనా ప్రేమించారా, పెళ్లెప్పుడు లాంటి ప్రశ్నలే వేస్తున్నారు. నిజం చెప్పాలంటే నన్ను ప్రేమిస్తున్నానంటూ చాలా చెబుతుంటారు. అయితే నాకు రెండుసార్లు ప్రేమ పుట్టింది. అది ఇద్దరిపై కలిగింది. సినిమాకు రాకముందు ఒకరిపై, నటినయిన తరువాత ఒకరిపైనా ప్రేమ పుట్టింది.

నటినవ్వక ముందు ప్రేమించడం సులభమే. సినిమాల్లోకి వచ్చిన తరువాత పేరు, అంతస్తు వచ్చిన తరువాత ప్రేమించడం కష్టం. అందుకు సమయం దొరకదు. ప్రేమలో పడితే తరచూ ప్రియుడిని కలుసుకోవాలి. చెట్టాపట్టాలేసుకుని షికార్లు కొట్టాలి. అందుకు సమయం కేటాయించలేనప్పుడు ప్రేమించి ఏం ప్రయోజనం? అందుకే నాకు ప్రేమించడానికి టైంలేదు. పెళ్లికి రెడీ అవలేదు కూడా. ఇన్నేళ నా నటపయనంలో చాలా మంది హీరోలు వచ్చి వెళ్లారు. వారితో హద్దుల్లోనే నడుచుకున్నాను.

చాలా కొద్దిమంది మినహా ఎవరితోనూ స్నేహంగా కూడా మలగలేదు. ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇక సినిమా విషయానికొస్తే రోజురోజుకు మారిపోతోంది. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా నన్ను నేను మార్చుకుంటున్నాను. కథా పాత్రలను వినూత్నంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాను. ఇందుకు చాలా చిత్రాలను చూస్తున్నాను. కొత్త కొత్త మనుషులను కలుసుకుంటున్నాను. ప్రేక్షకులకు మోనాటమి కలగకుండా వ్యత్యాసమైన నటనను ప్రదర్శించడానికి కృషి చేస్తున్నాను అని చెప్పుకొచ్చిన కాజల్‌ తాను ప్రేమలో పడ్డవారి పేర్లు, వారి వివరాలు చెప్పకుండానే సమధానం దాటవేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా