కాజల్‌ పెళ్లి పీటలెక్కనుందా ?

25 Jun, 2020 03:05 IST|Sakshi

‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌కి పరిచయమైన కాజల్‌ అగర్వాల్‌ తమిళ్, హిందీ భాషల్లోనూ దూసుకెళుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లికి పచ్చజెండా ఊపారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్‌ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. కాజల్‌ ప్రేమకి ఇంట్లో వాళ్లు పచ్చజెండా ఊపారని, వచ్చే ఏడాది పెళ్లి అనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారట.  పెళ్లి తర్వాత నిర్మాతగా మారి ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టడంతో పాటు తన భర్త వ్యాపారాల్లో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారట కాజల్‌. అయితే నటిగా సినిమాలకు దూరం కావాలనుకోవడం లేదని సమాచారం.

మరిన్ని వార్తలు