దర్శకురాలిగా మారిన హీరోయిన్‌

9 Mar, 2020 21:52 IST|Sakshi

నటి కళ్యాణి ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. మలయాళంలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి.. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న కళ్యాణి.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. దర్శకురాలిగా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కే2కే ప్రొడక్షన్‌పై చేతన్‌ శీను హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను హోలీ సందర్భంగా సోమవారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. సైకాలజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, సిద్ధి, రోహిత్‌ మురళి, శ్వేత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు