నామం పెట్టారు

5 Aug, 2018 02:07 IST|Sakshi
కస్తూరి

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఎక్కువగా సంపాదించేసి ట్యాక్స్‌ ఎగ్గొడతారని అనుకోవడం పొరపాటు. నేనెప్పుడూ నా ట్యాక్స్‌ ఎగ్గొట్టలేదు’’అన్నారు కస్తూరి. ‘అన్నమయ్య’లో ‘ఏలే ఏలే మరదలా...’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన కస్తూరి గుర్తుండే ఉంటారు. రీసెంట్‌గా ట్వీటర్‌లో ఓ నెటì జన్‌  ‘మీరు క్రమం తప్పకుండా ట్యాక్స్‌ పే చేస్తారా అని అడగ్గా– ‘‘కచ్చితంగా పే చేస్తూనే ఉంటాను. నిజానికి  నాకే నిర్మాతలు చాలాసార్లు నామం పెట్టారు. రాత్రీ పగలు అనే  తేడా లేకుండా షూటింగ్స్‌ చేస్తూ  ఉంటాం. కొన్ని సార్లు సినిమా రిలీజ్‌ అయ్యాక రెమ్యునరేషన్‌ ఇస్తాం అంటారు. చివరికి నామం పెడతారు. నాకు చాలా సార్లు జరిగింది. కానీ నేనెప్పుడూ నా ట్యాక్స్‌ విషయాల్లో నామం పెట్టలేదు’’ అని సమాధానమిచ్చారు కస్తూరి.

మరిన్ని వార్తలు