ప్రధానిపై కుష్బూ ఫైర్‌

23 Oct, 2019 07:27 IST|Sakshi

తమిళనాడు, పెరంబూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదిపై నటి కుష్బూఫైర్‌ అయ్యారు. ఇటీవల మహాత్మాగాంధి 150 జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో హిందీ చిత్ర ప్రముఖులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన సంస్కృతిని ప్రతిబింబించే ఒక వీడియోనూ ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, నటి సోనంకపూర్, కంగనారనౌత్, రకుల్‌ప్రీత్‌సింగ్, దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోష్, నిర్మాత ఏక్తాకపూర్, బోనీకపూర్‌  పాల్గొన్నారు. వారంతా ప్రధానితో ఫొటోలు దిగారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.కాగా ఈ కార్యక్రమంలో దక్షిణాదికి చెందిన ఏ ఒక్క కళాకారుడు లేకపోవడం విశేషం. ఈ విషయంపై తెలుగు నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా తాజాగా నటి కుష్బూ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఫైర్‌ అయ్యారు. ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ఇండియా సినిమా తరఫున ప్రధానమంత్రిని కలిసి అందరికీ తన నమస్కారాలన్నారు.

అయితే ప్రధానమంత్రికి ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలచుకున్నానన్నారు. హిందీ చిత్రాలు మాత్రమే మన దేశ ఆర్థికవ్యవస్థలో భాగం కాదన్నారు. దేశానికి ప్రాతినిథ్యం కాదని అన్నారు. దక్షిణాది చిత్రాలే ముఖ్య భాగం అని పేర్కొన్నారు. దక్షిణాది చిత్రాలే దేశానికి జాతీయస్థాయిలో ప్రాధాన్యత వహిస్తున్నాయన్నారు.సూపర్‌స్టార్స్‌ దక్షిణాది నుంచే వస్తున్నారని, ఇండియాలోని ఉత్తమ నటీనటులు దక్షిణాదికి చెందిన వారేనని పేర్కొన్నారు. ఉత్తమ సాంకేతిక నిఫుణులు దక్షిణాదికి చెందిన వారేనన్నారు. అలాంటిది దక్షిణాది సినిమాకు చెందిన వారిని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకింత పక్షపాతం అని ప్రశ్నంచారు. దక్షిణాది సినిమాను మన దేశం çగర్వ పడేలా చేసిన మనకు స్ఫూర్తిదాయకులైన వారిని ఆహ్వానించి ఉంటే బాగుండేదని అన్నారు. వారికా అర్హత ఉందని తాను భావిస్తున్నానని కుష్బూ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా