తిరిగొస్తున్నారు

2 Mar, 2019 00:17 IST|Sakshi
లైలా

‘ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, మిస్టర్‌ అండ్‌ మిస్‌ శైలజా కృష్ణమూర్తి’ చిత్రాల ద్వారా హీరోయిన్‌ లైలా సుపరిచితురాలే. తమిళ, కన్నడ భాషల్లోనూ హిట్‌ చిత్రాల్లో నటించారామె. 2006లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. గతేడాది తమిళంలో ఓ టీవీ షోలో జడ్జిగా కనిపించారు. తాజాగా తమిళ చిత్రం ‘అలీసా’ ద్వారా నటిగా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేయనున్నారట. యువన్‌ శంకర్‌ రాజా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మని చంద్రు అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు.     ఈ సినిమా కాకుండా ‘కండ నాళ్‌ ముదల్‌’ సీక్వెల్‌లో కూడా లైలా యాక్ట్‌ చేయబోతారనే వార్త ప్రచారంలో ఉంది. మరి తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తారా? చూద్దాం. 

మరిన్ని వార్తలు