అరబ్‌ గుర్రం అంటున్నారు!

17 Feb, 2017 02:32 IST|Sakshi
అరబ్‌ గుర్రం అంటున్నారు!

నన్ను అందరూ అరబ్‌ గుర్రంలా ఉన్నావంటున్నారు అని అంటోది నటి రాయ్‌లక్ష్మి. ఐటమ్‌ సాంగ్‌ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీ అనే నటి ఈ అమ్మడు. ఇటీవల తెలుగులో మెగాస్టార్‌తో సింగిల్‌సాంగ్‌లో చిందులేసి యువతకు యమ కిక్‌ ఇచ్చిన రాయ్‌లక్ష్మి తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో తానెప్పుడూ బిజీ అంటోంది.ఈ బ్యూటీతో చిన్న భేటీ..

ప్ర: కోలీవుడ్‌లో బొత్తిగా నల్లపూసైపోయినట్లున్నారు?
జ: అనూహ్యంగా బాలీవుడ్‌లో బిజీ అవడం వల్ల కోలీవుడ్‌లో కాస్త గ్యాప్‌ వచ్చిన మాట నిజమే.ఈ గ్యాప్‌ తరువాత తాజాగా యార్‌ అనే చిత్రంలో నటిస్తున్నాను.ఇది హీరోయిన్  పాత్రకు ప్రాధాన్యత ఉన్న సైకిలాజికల్‌ కథా చిత్రం. నేనిందులో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాను.ప్రేక్షకులకు ఫ్రెష్‌గానూ, మంచి కిక్‌ ఇచ్చేలా నా పాత్ర ఉంటుంది.

ప్ర: తెలుగులో చిరంజీవితో ఐటమ్‌ సాంగ్‌లో రెచ్చిపోయి అందాలారబోశారట?
జ: ఆ పాటలో నటించిన ఎక్స్‌పీరియన్స్   మరువలేనిది.నేను జూలీ–2 హిందీ చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక ఫోన్ కాల్‌ వచ్చింది. చిరంజీవితో ఒక పాటకు ఆట రెడీయాఅని అడిగారు. నేనేమీ ఆలోచించలేదు. ఓకే.ఎప్పుడు అని అడిగాను. రేపే రావాలి అని అన్నారు. కాస్త దడ పుట్టింది. 10 ఏళ్ల తరువాత చిరంజీవితో నటించే అవకాశం. అదీ ఆయన 150 చిత్రంలో. డాన్స్ కు చిరంజీవి చాలా ఫేమస్‌. ఆయనతో నటించాలన్నది ప్రతి నటికి ఒక కలనే చెప్పాలి. ఆశించకుండానే నాకు అవకాశం వచ్చింది. విషయాన్ని జూలి–2 చిత్ర దర్శక నిర్మాతలకు చెప్పి చిరంజీవితో సింగిల్‌సాంగ్‌లో నటించాను. ఆ పాటకు థియేటర్స్‌లో ఎంత రెస్పాన్సో. ఒకే ఒక్క పాటకు అంత మంచి గుర్తింపు రావడం ఆశ్చర్యమే.

ప్ర: హిందీ చిత్రం జూలి–2లోనూ అందాల మోతేనటగా?
జ: నిజం చెప్పాలంటే జూలి–2 నా తొలి హిందీ చిత్రం.ఆ తరువాతే ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన అకిరా చిత్రం అంగీకరించాన్  రేంజ్‌లో కనిపిస్తాను. స్మిమ్మింగ్‌ డ్రస్‌ బాగా నప్పాలని చాలా కష్టపడి బరువు కూడా తగ్గాను. ఇప్పుడు నన్నందరూ అరబ్‌ గర్రంలా ఉన్నావంటున్నారు. నాకు ఎలాంటి డ్రస్‌ అయినా సూపర్‌గా ఉంటుంది. ఈ చిత్రం విడుదల అనంతరం బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకూ నేనే టాక్‌ ఆఫ్‌ ది సిటీ అవుతాను. చాలా ధైర్యం చేసి నటించిన ఇందులోని నా పాత్ర చాలా గుర్తింపు పొందుతుంది.

ప్ర:  ఇంతకు ముందు మీ గురించి తరచూ వదంతులు ప్రచారం అయ్యేవి. చదవడానికీ చాలా జాలిగా ఉండేది. ఇప్పుడు తగ్గినట్లుందే?
జ: నాకు మాత్రం చాలా అసహనంగా ఉండేది. నేనూ, నా పనిలా ఉండే నాపై వదంతులు సృష్టించేవారు ఎవరు?ఎందుకు అలా రాస్తున్నారో అర్థం అయ్యేది కాదు. మొదట్లో నేనూ ఈజీగా తీసుకున్నాను. తరువాత అది విపరీతంగా మారడంతో చిరాకనిపించేది. ఇప్పుడు అలా కాదు. నాకు మెచ్యూరిటీ వచ్చింది. నా గురించి ఎవరూ గేలి చేయలేరు. ఇకపై నా గురించి గాసిప్స్‌ రావు.

ప్ర: సరే. అందాలరాశిలా ఉన్నారు. మిమ్మల్నెవరూ లవ్‌ చేయలేదా? మీరెవరినీ లవ్‌ చేయలేదా?
జ: నిజం చెప్పాలంటే నాకు ప్రేమించడానికి సమయమే లేదు.ఇక లవ్‌ అన్నది ఎప్పుడు? ఎలా? ఎవరిపై పుడుతుందన్నది అనేది ఒక రకమైన హైపోతెడికలానా మ్యాటర్‌. అది నాకు సెట్‌ అవుతుందా?అన్నది కూడా తెలియదు. జరగాల్సినవి అవే జరుగుతాయి. కాయ తానుగా పండాలి. కార్బొనైటట్‌తో పండించకూడదు.