తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం

10 Dec, 2017 11:18 IST|Sakshi

‘సాక్షి’తో సినీ నటి నందిత శ్వేత

తణుకు: ఇకపై తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తానని, ఇక్కడి తెలుగువారంటే తనకు ఎంతో గౌరవమని ప్రముఖ సినీనటి నందిత శ్వేత పేర్కొంది. ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా..’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ నటి శనివారం తణుకు వచ్చేసింది. తణుకులో వన్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ ప్రారంభించిన ఆమె కొద్ది సేపు ‘సాక్షి’తో చిట్‌చాట్‌ చేసింది.

మీ స్వస్థలం...?
బెంగళూరు, కర్నాటక

చిత్రరంగ ప్రవేశం ఎలా.?
మోడల్‌గా రాణిస్తుండగా 2008లో కన్నడ చిత్రంలో అవకాశం వచ్చింది.

ఎన్ని చిత్రాలు చేశారు?
తమిళంలో 17 చిత్రాలు చేశాను.

తెలుగులో ఎలా..?
ఎక్కడకు పోతావు చిన్నవాడా చిత్రంలో తెలుగులో మొదటి చిత్రం చేశాను. దీనిలో అమల పాత్ర ఎంతో పేరు తెచ్చింది.

రాబోయే చిత్రాలు?
తెలుగులో రెండు చిత్రాల్లో అవకాశం వచ్చింది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను.

ఏ భాషకు ప్రాధాన్యం ఇస్తారు?
తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఇక్కడి అభిమానులు ఆత్మీయత మర్చిపోలేను.

అవార్డులు?
తమిళంలో ఓ చిత్రంతో పాటు తెలుగులో మొదటి చిత్రం ఎక్కడకు పోతావు చిన్నవాడా చిత్రానికి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాను. 

లక్ష్యం?
తెలుగు చిత్రపరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు పొందాలని ఉంది. 

మరిన్ని వార్తలు