వివాదాస్పదమైన నటి ఫొటోషూట్‌

5 Aug, 2018 08:42 IST|Sakshi

శాండల్‌వుడ్‌ హీరోయిన్‌ నిధి సుబ్బయ్య వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె మైసూరు అరమనె (మైసూరు ప్యాలెస్‌)లోని దర్బార్‌ హాల్‌లో ఫొటో షూట్‌ చేయటంపై వివాదం నెలకొంది. గత కొంత కాలంగా ప్యాలెస్‌ పరిసరాల్లో ఫొటోషూట్‌ చేయటంపై అధికారులు నిషేదం విధించారు. అయితే నిషేదిత ప్రాంతంలోని హాల్‌లో దిగిన ఫొటోనూ నిధి తనసోషల్‌మీడియా పేజ్‌లో పోస్ట్ చేయటంతో వివాదం మొదలైంది.

దీంతో నటి నిధి సుబ్బయ్య కు ప్యాలెస్‌ అధికారులు ఎలా అనుమతిచారంటూ సామాజిక మాధ్యమాలలో ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఒక జంట నిషేధించిన ప్రాంతంలో ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ చేయటం పెద్ద వివాదమైంది. అయితే ఫొటోలు తీయటం  నిషేధించలేదని, నవరాత్రి సమయంలో బంగారు సింహాసనం, అంబారి ఉన్నప్పుడు మాత్రమే నిషేధం అమలులో ఉంటుందని ప్యాలెస్‌ భద్రత ఏసీపీ శైలేంద్ర వివరణ ఇచ్చారు.

ఈ వివాదంపై నిది స్పందించారు. నేను ప్యాలెస్‌లో ఎలాంటి ఫొటోషూట్ చేయలేదు. కేవలం ఒక టూరిస్ట్‌ లా ప్యాలెస్‌ చూడటానికి వెళ్లా.. అందరు టూరిస్ట్‌లాగే నేను ఫొటో తీసుకున్నా’ అని తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు