నాకు ఆ అవకాశం ఇవ్వలేదు

15 Feb, 2020 02:00 IST|Sakshi
ప్రీతి అస్రాని

‘‘అమెరికా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది. కుటుంబ బంధాలు ఎక్కువగా ఉండే సినిమా ఇది. అన్ని పాత్రలు రియలిస్టిక్‌గా ఉంటాయి. హీరోయిన్‌ పరిచయ సన్నివేశం బాగా నచ్చింది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పాను’’ అని ప్రీతి అస్రాని అన్నారు. సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్‌ కుక్కర్‌’. ‘ప్రతి ఇంట్లో ఇదే లొల్లి’ అనేది ట్యాగ్‌ లైన్‌. సుజోయ్, సుశీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రీతి అస్రాని మాట్లాడుతూ– ‘‘నేను గుజరాత్‌ నుంచి వచ్చాను. సినిమాల్లో నటించాలని చిన్నప్పట్నుంచి ఉండేది. మా అక్క అంజు అస్రాని తెలుగులో పలు సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నారు.. ఆమె స్ఫూర్తితోనే నటి అయ్యాను. టె¯Œ ్త పూర్తి చేశాక హైదరాబాద్‌ వచ్చాను. ముందు ‘ఫిదా’ అనే షార్ట్‌ ఫిలింలో నటించాను. ఆ తర్వాత కొన్ని వెబ్‌ సిరీస్‌లలో, ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్‌లో నటించా. ‘ప్రెషర్‌ కుక్కర్‌’తో హీరోయిన్‌గా పరిచయమవుతున్నా. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అనిత.. బీటెక్‌ చదువుతుంటాను.

హీరోపై చాలా ఒత్తిడులు ఉంటాయి.. అందుకే అతను ప్రెషర్‌ కుక్కర్‌లో ఉన్నట్టు ఫీలవుతాడు. దీంతో ఆ టైటిల్‌ పెట్టారు. ఈ సినిమాలో కామెడీ, డ్రామా, ఎమోషన్‌ సన్నివేశాలుంటాయి. తనికెళ్ల భరణిగారి పాత్ర ఎక్కువ ఉంటుంది. మా సినిమాకు నలుగురు మ్యూజిక్‌ డైరెక్టర్లు పనిచేశారు.. మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయి. నేను మంచి డ్యాన్సర్‌నే కానీ డైరెక్టర్‌ నాకు డ్యాన్స్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు ఉన్నా ఎక్కడా ఒత్తిడి పెట్టలేదు. ప్రస్తుతం గోపీచంద్‌గారి ‘సీటీమార్‌’ సినిమాలో కబడ్డీ కెప్టెన్‌గా నటిస్తున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు