ఒక్కరికైనా సాయపడండి

7 Apr, 2020 00:43 IST|Sakshi
రకుల్‌ప్రీత్‌ సింగ్‌

‘‘ఈ  లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో పేదలకు సాయం చేయగలిగినవారు కనీసం రోజులో ఒక్కరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి’’ అని కోరుకుంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన దాదాపు 200 కుటుంబాలకు ఆహారం అందజేస్తున్నారు రకుల్‌. గుర్గావ్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న పేదవారికి రకుల్‌ ఈ సహాయం చేస్తున్నారు. ‘‘లాక్‌డౌన్‌ కారణంగా పేదవారి జీవనశైలి దెబ్బతింటోంది. కనీస అవసరాలు తీరని పేదవారికి మేం సహాయం చేయాలనుకున్నాం.

మా వంతుగా మా ఇంటి సమీపంలోని బస్తీలో నివాసం ఉంటున్న 200 కుటుంబాలకు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. లాక్‌డౌన్‌ పూర్తయ్యేంతవరకు ఇలా చేయాలనుకున్నాం. ఒకవేళ లాక్‌డౌన్‌ పొడిగిస్తే  మా సహాయాన్ని కూడా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇదంతా మా నాన్నగారి (కుల్విందర్‌ సింగ్‌) ప్రోత్సాహంతోనే జరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో నా వంతుగా నేను ఏదో సాయం చేయాలని  తాపత్రయపడుతుంటాను’’ అని పేర్కొన్నారు రకుల్‌.

>
మరిన్ని వార్తలు