భర్త నుంచి రంభ విడిపోయిందా?

18 Oct, 2013 13:18 IST|Sakshi
భర్త నుంచి రంభ విడిపోయిందా?

 నటి రంభ భర్త నుంచి విడిపోయిందా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. 1990 ప్రాంతంలో క్రేజీ హీరోయిన్‌గా రాణించిన నటి రంభ తమిళం, తెలుగు భాషల్లో సూపర్‌స్టార్స్ అందరితోనూ జతకట్టింది. మంచి ఫామ్‌లో ఉండగానే కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. కొన్నాళ్ల వరకు వీరి సంసార జీవితం అన్యోన్యంగానే సాగింది. ఆ మధ్య నటించే అవకాశాలు వచ్చినా రంభ నిరాకరించింది.

ఇటీవల భర్త ఇంద్రన్‌తో మనస్పర్థలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం రంభ విడిగా జీవిస్తోందని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు రంభ మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమైందని, తమిళంలో శింబు హీరోగా నటించనున్న చిత్రంలో ముఖ్య పాత్రను పోషించనుందని సమాచారం. అదే విధంగా హీరోయిన్ పాత్రలే కాదు ఇకపై అక్క, వదిన తరహా పాత్రలను కూడా సై అంటోందట. తెలుగులోనూ అవకాశాల వేట ప్రారంభించిందట. మరి అందాల తార రీ ఎంట్రీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.