క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన రెజీనా

12 Jul, 2018 19:41 IST|Sakshi

సాక్షి, సినిమా : ప్రస్తుతం సినీ ప‌రిశ్రమని క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటన(చికాగో సెక్స్‌ రాకెట్‌)లు కుదిపేస్తున్నాయి‌. దీనిపై వర్ధమాన నటీమణులకు నటి రెజీనా ఓ సలహా ఇచ్చారు. చాలా మంది క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితులేనని ఒక్కొక్కరూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దీని గురించి నటి రెజీనా ఏమన్నారో చూద్దాం.. 

‘క్యాస్టింగ్‌ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటనలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా అలాంటి ప్రచారంలో వాస్తవాలు ఉంటే ఏదో ఒక రోజున చర్యలు తీసుకోవలసిందే. దీని గురించి నేనేమైనా స్పందిస్తే దాన్ని వేరేగా చిత్రీకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తమకు ఇష్టం వచ్చిన విధంగా కొందరు మాట్లాడుతుంటారు. అలాంటి వాటిలో ఏది నిజం అన్నది మీడియా నిర్ధారించుకుని ప్రసారం చేయాలి. ఎందుకంటే మీడియా ప్రసారాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఇలాంటి వ్యవహారాల గురించి ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనల నుంచి వర్ధమాన తారలు పాఠం నేర్చుకుని వాటికి దూరంగా ఉండాలన్నదే నా సలహా’ అని రెజీనా చెప్పారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా