కబాలి కూతురి వాలుజడ!

28 Aug, 2017 01:55 IST|Sakshi
కబాలి కూతురి వాలుజడ!

ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ‘కబాలి’లో రజనీకాంత్‌ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక. ‘కబాలి’లో మోడ్రన్‌గా కనిపించిన ధన్సిక కొత్త సినిమా కోసం ఇలా ట్రెడిషనల్‌గా మారారు. తమిళ దర్శకులు చేరన్, గౌతమ్‌ మీనన్, ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమణ మల్లం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వాలుజడ’. ‘శరణం గచ్ఛామి, జానకి రాముడు’ సినిమాల ఫేమ్‌ నవీన్‌ సంజయ్, సాయి ధన్సిక జంటగా నటిస్తున్నారు.

హిందీ నటుడు నానా పటేకర్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధన్సిక ఫస్ట్‌ లుక్‌ను  కాజల్‌ అగర్వాల్‌ విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రమిది. తమిళంలో ‘కుజాళి’గా రూపొందిస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూరై్తంది. సెప్టెంబర్‌లో భారీ షెడ్యూల్‌ మొదలవుతుంది’’ అన్నారు దర్శకుడు రమణ మల్లం. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ రామస్వామి, కూర్పు: కె.ఎల్‌. ప్రవీణ్,  కళ: కిరణ్, స్టంట్స్‌: అన్బు–అరియు, సాహిత్యం: చంద్రబోస్, కందికొండ, సంగీతం: రధన్‌.