సమంత విషయంలో అది నిజమేనా?

8 Mar, 2020 07:24 IST|Sakshi

అది నిజమేనా? నటి సమంత విషయంలో వ్యక్తం అవుతున్న తాజా ప్రశ్న ఇది. సినిమా సెలబ్రెటీల గురించి రకరకాల ప్రచారం జరుగుతుంటుంది. అలాంటి ప్రచారంలో ఏది నిజం, ఏది వదంతి అన్నది తెలియడం కష్టమే. సంబంధింత నటో, నటుడో వివరణ ఇచ్చే వరకూ ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి వారు అలాంటి ప్రచారాన్ని ఖండించినా, అది ఆగదు. ఎందుకంటే తమ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉన్నా నటీనటులు తొందర పడి దాన్ని అంగీకరించరు. అందుకు వారికుండే సమస్యలు వారికి ఉంటాయి. ఇప్పుడు నటి సమంత గురించి అలాంటి ఒక ప్రచారం జరుగుతోంది.

తమిళం, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి సమంత. తెలుగు నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన తరువాత తన చిత్రాల ఎంపికలో పంథా మార్చుకున్నారనే చెప్పాలి. సెలెక్టెడ్‌ చిత్రాలనే చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్‌ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అలా నటిగా దశాబ్దాన్ని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయని, అదే తన బలం అని పేర్కొంది. ఒక్కో చిత్రం ఒక్కో పాఠాన్ని నేర్పుతుందని చెప్పింది. సక్సెస్‌లను చూసి గర్వపడడం లేదని అంది. నటుడు సూర్యతో నటించినప్పుడు మాత్రం గర్వంగా ఫీలయ్యానని చెప్పింది. ఎందుకంటే కళాశాలలో చదువుతున్నప్పటి నుంచే తాను ఆయన అభిమానినని చెప్పింది. అలాంటిది ఆయనకు జంటగా నటించడం గొప్ప విషయమేనని అంది. చదవండి: చైతూకి 49, సమంతకు 51: సామ్‌ ట్వీట్‌!

కాగా అంతా బాగానే ఉంది గానీ,ప్రస్తుతం తెలుగులో ఓ బేబీ చిత్రం తరువాత మరో చిత్రాన్ని అంగీకరించలేదు. ఇకపోతే తమిళంలో రెండు చిత్రాల్లో నటించడానికి అంగీకరించింది. నయనతార ప్రియుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి కాత్తు వాక్కుల రెండు కాదల్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా ఇప్పుడీ చిత్రం నుంచి సమంత వైదొలగిందనే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణం ఈ అమ్మడు అమ్మ కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం ఎంత అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇక పోతే కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రం నుంచి నటి సమంత వైదొలగిందన్న ప్రచారాన్ని ఆ చిత్ర వర్గాలు కొట్టి పారేశాయి. తమ చిత్రంలో సమంత నటించనున్నట్లు వారు స్పష్టం చేశారు. కాగా ఈ చిత్రంతో పాటు మాయ చిత్రం ఫేమ్‌ అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని సమంత అంగీకరించింది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం అని సమాచారం. చదవండి: ఒక్క ఫ్లాప్‌తో విలువ తగ్గిపోదు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా