మూడేళ్లుగా సమస్యల్లో ఉన్నా: శ్రుతిహాసన్‌

7 Jun, 2020 06:51 IST|Sakshi
శ్రుతిహాసన్‌ 

మూడేళ్లుగా సమస్యల్లో ఉన్నట్టు నటి శ్రుతిహాసన్‌ పేర్కొన్నారు. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటి శ్రుతిహాసన్‌. నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ మధ్య నటనకు దూరంగా ఉన్నారు. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయకిగా బిజీగా ఉన్నారు. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇటీవల ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఆగిపోతుందన్నారు. ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి అన్నారు. ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అందులో ఒకటి మానసిక సమస్యగా పేర్కొన్నారు. ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నట్లు అన్నారు.

సాధారణంగా ప్రజలు హెచ్చరికగానే ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం బయటకు చెప్పటానికి సంతోషిస్తున్నారన్నారు. తాను కూడా మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివే చికిత్స అని తెలిపారు. తాను నిత్యం క్రమం తప్పకుడా వీటిని పాటిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా సంగీతాన్ని వినడం, పుస్తక పఠనం, రాయడం వంటివి చేసుకుంటానని తెలిపారు. 
చదవండి: ఆ కష్టం తెలుస్తోంది!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు