అది ప్రశ్నలా మిగిలిపోయింది

3 Jul, 2018 01:36 IST|Sakshi
టబు

నటిగా అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు టబు. ‘చాందినీ బార్, చీనీ కమ్,  నిన్నే పెళ్లాడతా, ప్రేమ దేశం’ వంటి సూపర్‌ హిట్స్‌లో నటించిన ఈ 46 ఏళ్ల సుందరి రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఇంకా సింగిలే. ‘సింగిల్‌గా ఉంటున్నానని నేనెప్పుడూ బాధపడలేదు’ అని అంటున్నారు టబు. ఇటీవల ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో  సింగిల్‌గా ఉండటం, పెళ్లి గురించి టబు మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌లో సింగిల్‌గా ఉన్న ఏ మూమెంట్‌లోనూ నేను  బాధపడలే దు. ప్రతి నిమిషాన్ని బెస్ట్‌ అని ఫీల్‌ అవుతాను.

ఎందుకంటే ఇంకో సైడ్‌ (రిలేషన్‌షిప్‌) ఏంటో నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోలేదు. రెండు సైడ్స్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేసినప్పుడే ఏది బెస్టో చెప్పగలం.  సో.. సింగిల్‌గా ఉండటమా? రిలేషన్‌షిప్‌లో ఉండటమా? ఏది బెస్టో కచ్చితంగా చెప్పలేను. పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నందుకు ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. లైఫ్‌లో పెళ్లి చేసుకుంటానా? అనే ప్రశ్న కూడా ప్రశ్నలా  ఉంది. దానికి నా దగ్గర ప్రస్తుతానికైతే సమాధానం లేదు’’ అని  పేర్కొన్నారు టబు.

మరిన్ని వార్తలు