నేను స్విమ్మర్‌ని.. కానీ ఈత రాదు!

2 May, 2017 23:31 IST|Sakshi
నేను స్విమ్మర్‌ని.. కానీ ఈత రాదు!

‘‘బాబు బాగా బిజీ’ చిత్రం నాకో జర్నీలాంటిది. ఏడాదిగా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. రియల్‌ లైఫ్‌లో నేనెలా ఉంటానో, దానికి పూర్తి విరుద్ధంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది’’ అన్నారు కథానాయిక తేజస్వి మదివాడ. అవసరాల శ్రీనివాస్‌ హీరోగా, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లుగా నవీన్‌ మేడారం దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మించిన  ‘బాబు బాగా బిజీ’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజస్వి చిత్ర విశేషాలు మీడియాతో పంచుకున్నారు.

బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘హంటర్‌’కు రీమేక్‌గా ‘బాబు బాగా బిజీ’ తెరకెక్కింది. హిందీలో పరుల్‌ కొటక్‌ చేసిన పాత్ర నాది. ఆ పాత్ర చూసి, ఇమిటేట్‌ చేయడానికి ప్రయత్నించా. ఈ చిత్రంలో నేను స్విమ్మర్‌గా కనిపిస్తా. రియల్‌ లైఫ్‌లో నాకు స్విమ్మింగ్‌ రాదు. సినిమా కోసం ఎలాగోలా మేనేజ్‌ చేశాను?

నా రోల్‌ వెరీ సింపుల్‌ అండ్‌ స్వీట్‌. సైలెంట్‌గా, అమాయకమైన అమ్మాయిగా నటించా. నాపై ఎలాంటి స్పైసీ సన్నివేశాలు, డైలాగులు లేవు. ఒక పాట మాత్రం ఉంటుంది. షూటింగ్‌లో అవసరాలను ర్యాగింగ్‌ చేశా. అందర్నీ బాగా విసిగించా. అయినా అందరూ లైట్‌ తీసుకున్నారు.

నేను తెలుగమ్మాయిని కావడంతో డైలాగులు పలకడానికి నాకు పెద్ద కష్టం ఉండేది కాదు. కానీ, పాత్ర పర్‌ఫెక్షన్‌ కోసం ఒక్కో సీన్‌ను దర్శకుడు నవీన్‌ ఐదుసార్లు  చేయించేవారు. ప్రస్తుతానికి కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదు. దర్శకురాలు నందినీరెడ్డిగారి రైటింగ్స్‌లో ఓ వెబ్‌సిరీస్‌కు సైన్‌ చేశా. ఆర్నెల్ల పాటు ఆ సిరీస్‌ ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి