వర్జిన్‌‌, వెజిటేరియన్‌ అంటూ పెళ్లి ప్రపోజల్‌

7 Jul, 2020 18:51 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరోయిన్‌ తిలోత్తమ షోమ్‌ పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇందుకు నటి షేర్‌ చేసిన ఓ స్క్రీన్‌ షాట్‌ కారణంగా నిలిచింది. ఇటీవల తిలోత్తమకు తనను పెళ్లి చేసుకుంటానంటూ ఓ వ్యక్తి నుంచి వింతైన ప్రపోజల్‌ వచ్చింది. అయితే ఈ ప్రపోజల్‌ ఏ గులాబి పువ్వుతోనో, ప్రేమ లేఖ ద్వారానో కాదు. సోషల్‌ మీడియాలో మెసేజ్‌ ద్వారా తిలోత్తమ అంటే ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కోరాడు. ‘ఐ లవ్‌ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. జీవితాంతం మీతో కలిసి ఉంటాను. నేను వర్జిన్‌. అలాగే వెజిటేరియన్‌ కూడా. అంతేగాక లై- డిటెక్టర్‌, నార్కో టెస్టు, వర్జినిటి, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ మెసేజ్‌ చేశారు. (‘అంతకంటే ముందు నేను ఓ పని చేయాలి’)

ये कैसा शाकाहारी मज़ाक हैं भाई? No thanks. Bye bye Tata bata alvida।

A post shared by Tillotama Shome (@tillotamashome) on

దీనిపై స్పందించిన తిలోత్తమ ‘బ్రదర్‌ జోక్‌గా ఉందా.. అవసరం లేదు ధన్యవాదాలు.. బై బై’ అంటూ ఈ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇక ఈ పోస్టుపై నటి ఇషా చోప్రా కామెంట్‌ చేశారు. తనకు కూడా ఇలాంటే మెసేజ్‌ వచ్చిందని పేర్కొన్నారు. కాగా ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్’‌ సినిమాతో బాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైన తిలోత్తమ షోమ్‌ అంతకముందు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. చివరగా ఆంగ్రేజీ మీడియంలో కనిపించారు. (‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు