రియల్‌ గర్జన

24 Sep, 2017 04:38 IST|Sakshi

తమిళసినిమా: దక్షిణాదిలో నటి త్రిష తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కట్టా మిఠా చిత్రం తో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్నారు. అయితే ఇప్పటి వర కూ త్రిషలోని అందాన్ని, అభినయాన్ని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు గర్జించే నటనను చూడబోతున్నారట. అదీ చాలా రియల్‌ రిస్క్‌ చేసి నటించిన యాక్షన్‌ సిన్నివేశాలను చూసి థ్రిల్‌ అవుతారట. విషయం ఏమిటంటే త్రిష నటిస్తున్న తాజా చిత్రం గర్జన.

లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా త్రిష యాక్షన్‌ అవతారమెత్తారు. సుందర్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఇందులో త్రిష డాన్సర్‌గా నటిస్తున్నారు. ఒక ప్రోగ్రాం కోసం కోడైకెనాల్‌ వచ్చిన తను ఒక ఆపదలో చిక్కుకుంటుంది. అందులోంచి ఎలా బయట పడిందన్నదే గర్జన చిత్రం అని దర్శకుడు సుందర్‌బాబు తెలిపారు. మరో విషయం ఏమిటంటే హిందీలో మంచి విజయాన్ని సాధించిన ఎన్‌హెచ్‌ 10 చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం గర్జన అని దర్శకుడు చెప్పారు.

ఇందులో త్రిష కోడైకెనాల్‌లోని అడవి ప్రాంతంలో మెలికలు తిరిగే చాలా డేంజరస్‌ రోడ్డులో జీప్‌ను వేగంగా నడిపే సన్నివేశాలు. కారైక్కుడిలో గుర్రపు స్వారీ సీన్స్, అదేవిథధంగా  రోప్‌ ఫైట్స్‌ వంటి రిస్కీ సన్నివేశాల్లో ఎలాంటి డూప్‌ లేకుండా నటించారట. అలా త్రిష రోరింగ్‌ సన్నివేశాలతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా గర్జన ఉంటుందట. ఇది త్రిష కెరీర్‌లోనే ఇంతకు ముందు ఇకపై కూడా చేయనటువంటి చిత్రంగా గర్జన ఉంటుందని దర్శకుడు సుందర్‌బాబు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు