'అవకాశం కావాలంటే పడకగదికి రావాలన్నారు'

14 Mar, 2020 08:31 IST|Sakshi

చెన్నై : 'అవును నేనూ అలాంటి ఘటనలు ఎదుర్కొన్నాను' అని నటి వాణిబోజన్‌ పేర్కొన్నారు. తాను కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినేననంటూ బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్‌ అయిన నటి వాణిబోజన్‌ తెలిపారు.'ఓ మై కడవులే' చిత్రంతో సినిమాల్లో ఎంటరయిన ఈ భామ తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం వైభవ్‌తో జతకట్టిన లాకప్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ మధ్యన వాణిబోజన్‌ తరచూ వార్తల్లో ఉంటోంది. గ్లామర్‌ విషయంలోనూ కాస్త ఫాస్ట్‌గా ఉన్న ఈ బ్యూటీ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఒక భేటీలో తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు తానూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నానని, ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది. ప్రసుత్తం వాణిబోజన్‌ చెప్పిన విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. (దసరాకు రాకీ భాయ్‌ వస్తున్నాడు)

మాయ అనే టీవీ సీరియల్‌ ద్వారా వాణిబోజన్‌ నటిగా పరిచయమయ్యారు.అయితే ఈ అమ్మడిని పాపులర్‌ చేసింది మాత్రం దైవమగళ్‌ అనే సీరియల్‌. ఈ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణిబోజన్‌ సాధారణంగా తన మేనేజర్‌తోనే నిర్మాతలు సంప్రదిస్తారని చెప్పింది. అలా పలువురు నిర్మాతలు అవకాశాల కోసం తనను పడక గదికి పిలిచినట్లు మేనేజర్‌ చెప్పారని అంది. కాస్టింగ్‌ కౌచ్‌ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇంతకు ముందే పలువురు నటీమణులు మీటూ బాధలను వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లారు. ఈ వ్యవహారం రోజురోజుకూ అధికమవుతోంది. హీరోయిన్లు, కాస్త నాగరీకంగా దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా నడుచుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లాంటి వారు కాస్టింగ్‌ కౌచ్‌ వంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనాలని, జరిగిపోయిన తర్వాత చెబితే ప్రయోజనం ఉండదని అంటున్నారు.  (అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి)

మరిన్ని వార్తలు