ఈమె మూడో పెళ్లి కూడా..

7 Jul, 2020 10:32 IST|Sakshi

తమిళ సినిమా(చెన్నై): తాను సివంగిని అని అంటోంది నటి వనితా విజయకుమార్‌. మొదట్లో చంద్రలేఖ వంటి కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ తర్వాత వెండి తెరపై కనిపించలేదు. తరచూ ఏదోఒక వివాద వార్తల్లో ఉంటూనే ఉంది. ఆ మధ్య బిగ్‌బాస్‌–3 రియాల్టీ షోలో పాల్గొని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న వనిత ఇటీవల మూడో పెళ్లి చేసుకుంది. ఈమె మూడో పెళ్లి కూడా వివాదాలకు గురవుతోంది. వనిత తాజాగా పెళ్లి చేసుకున్న పీటర్‌పాల్ కూడా ఇంతకుముందు ఒక పెళ్లి చేసుకున్నాడు. అది ఇప్పుడు వివాదంగా మారింది. వనిత, పీటర్‌ పాల్ పెళ్లి చేసుకున్నరోజు సాయంత్రమే అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే నటి వనితను పెళ్లి చేసుకున్నారని ఆరోపింది. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని నటి వనితపేర్కొంది.

నటి వనిత మూడో పెళ్లిపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కుట్టి పద్మిని అదేవిధంగా నిర్మాత రవీంద్రన్‌ చంద్రశేఖర్‌ వంటివారు పీటర్‌ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి వనిత పెళ్లి చేసుకుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిపై వనిత విరుచుకుపడింది. ‘మీ పని మీరు చూసుకోండి’ అంటూ ఫైర్ అయ్యింది. లక్ష్మీరామకృష్ణన్, కుట్టిపద్మిని వెంటనే సారీ చెప్పారు. నిర్మాత రవీంద్రన్‌ చంద్రశేఖర్‌ మాత్రం తాను క్షమాపణ చెప్పేదిలేదన్నారు. నటి వనిత అంటే తనకు అభిమానమన్నారు. అలా ఒక అభిమానిగా ఆమె తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపే హక్కు తనకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నటి వనిత తన ట్విటర్‌లో పేర్కొంటూ ‘ఒక తల్లిగా తన జీవితం, ప్రతిభపై అక్కరచూపుతున్న మీ అందరికీ తాను చెప్పేది ఒక్కటే.. నేను సహజంగానే సివంగిని’ అని చెప్పింది. తన పిల్లలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు అని అంది. మరి ఈ చర్చ ఇంకా ఎంత కాలం సాగుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా