అవకాశాల కోసం పాట్లు

30 Apr, 2018 09:16 IST|Sakshi

తమిళసినిమా: అవకాశాల కోసం అభినయాన్ని నమ్ముకుంటే లాభం లేదని ఈ తరం తారలు స్ట్రాంగ్‌గా భావిస్తున్నట్లు చెప్పవచ్చు. గ్లామరే చరణం అని వారు నమ్ముకుంటున్నారు. అందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. సోషల్‌మీడియాను బాగా వాడుకుంటున్నారు. నటి ఆదాశర్మ ఇప్పుడు ఇదే పనిలో పడింది. ఈ ముంబై బ్యూటీ కొన్ని హింది, తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా క్రేజ్‌ను సంపాదించుకోలేకపోయింది. ఇక కోలీవుడ్‌లో శింబు నయనతార జంటగా నటించిన ఇదు నమ్మఆళు చిత్రంలో గెస్ట్‌గా మెరిసింది. ఆ చిత్రంతో అక్కడ పాగా వేయాలని ఆశ పడినా అది జరగలేదు. దీంతో ఎలాగైనా అవకాశాలు సంపాదించుకోవాలన్న ఆరాటంతో ఉన్న ఆదాశర్మ ఇటీవల గ్లామరస్‌ దుస్తులను ధరించి వివిధ భంగిమలతో కూడిన ఫొటోలను తీయించుకుంది.

ఇందుకోసం లక్షల్లో ఖర్చు చేసిందట. సముద్ర తీరంలో టూపీస్‌ దుస్తులు ధరించి ఫొటోలను తీయించుకుంది. ఆమె ధరించిన దుస్తులను చూసిన ఆ పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయారట. కొందరైతే అలానే కళ్లప్పగించి చూస్తుండిపోయారట. అలా సముద్రతీర ప్రాంతంలో, ఓడలో గ్లామరస్‌గా ఫొటోలను తీయించుకుని వాటిని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో పాటు ఒక కామెంట్‌ను కూడా చేసింది. అదేంటంటే మీరూ నాలాగా టూపీస్‌ దుస్తులు ధరించి గ్లామర్‌గా కనిపించాలనుకుంటున్నారా? అందుకు మీరు చేయవలసింది రెండే విషయాలు. ఒకటి టూపీస్‌ ఈత దుస్తులు కొనుక్కోండి. రెండు వాటిని మీ అందమైన ఒంటికి ధరించండి అంతే అని ఆదాశర్మ చేసిన కామెంట్‌కు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయట. ఆమె గ్లామర్‌ ఫొటోలను చూసి అభిమానులు పరవశించిపోతున్నారట. అంతా బాగానే ఉంది వ్రతం చెడ్డా ఫలితం దక్కేనా అన్న సామెతలా ఈ అమ్మడికి అవకాశాలు దరిచేరేనా? అన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు