అమ్మమ్మతో హీరోయిన్ డ్యాన్స్.. వైరల్

26 Mar, 2018 18:19 IST|Sakshi

సాక్షి, సినిమా: అరంగేట్ర చిత్రం 'హార్ట్ ఎటాక్'తో నటిగా మార్కులు కొట్టేసింది అదాశర్మ. తన కొత్త డ్యాన్స్ పార్ట్‌నర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఆమె పోస్ట్ చేశారు. మీ డ్యాన్స్ పార్ట్‌నర్ ఎవరో చెప్పాలంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 24 గంటల వ్యవధిలో 14 లక్షల మంది వీడియోను వీక్షించారు. మీరు, మీ అమ్మమ్మ సూపర్ అంటూ నటి అదాశర్మను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియో బాగుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

ఆ పోస్ట్‌లో అదాశర్మ ఏం రాశారంటే.. 'నా డ్యాన్స్ పార్ట్‌నర్ మా గ్రాండ్ మదర్. మీ పార్ట్‌నర్ ఎవరో ట్యాగ్ చేయండి. నాకు అదివారం ప్రేరణ, నా జీవితంలో సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి, శ్రమించే తత్వం, డ్యాన్స్ టీచర్ అన్నీ మా గ్రాండ్ మదర్' అంటూ పోస్ట్ చేశారు. 'బామ్ డిగ్గి డిగ్గి' అనే పాటకు డ్యాన్స్ చేస్తుండగా అమ్మ ఈ వీడియో తీశారని నటి అదాశర్మ తెలిపారు. సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం మూవీలతో తెలుగు ప్రేక్షకులకు అదాశర్మ సుపరిచితమే.

మరిన్ని వార్తలు