మళ్లీ పోలీసాఫీసర్‌

25 Jul, 2018 00:28 IST|Sakshi

ఫైట్స్‌ చేయడానికి లండన్‌లోని గల్లీ గల్లీ గాలిస్తున్నారు విద్యుత్‌ జమాల్‌ అండ్‌ టీమ్‌. ప్లేస్‌ ఫిక్స్‌ చేసిన తర్వాత అక్కడికి ‘హార్ట్‌ఎటాక్‌’ గాళ్‌ అదా శర్మ వెళ్తారట. బీ టౌన్‌లో రెండేళ్ల క్రితం రిలీజైన యాక్షన్‌ చిత్రం ‘కమాండో 2’. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ రూపొందనుంది. ‘కమాండ్‌ 2’లో నటించిన విద్యుత్‌ జమాల్, అదా శర్మనే థర్డ్‌ పార్ట్‌లోనూ లీడ్‌ రోల్స్‌ చేయనున్నారని సమాచారం.‘కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్‌’ టైటిల్‌తో సన్నీలియోన్‌ బయోపిక్‌ను వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కించిన ఆదిత్యా దత్‌ ‘కమాండో 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

విపుల్‌ షా నిర్మిస్తారు. ‘కమాండో 2’లో అదా శర్మ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించారు. థర్డ్‌ పార్ట్‌లో కూడా అదే రోల్‌లో నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌కు చాన్స్‌ ఉంది. ఆ రోల్‌ కోసం కొందరి కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట కమాండో టీమ్‌. అలాగే యాక్షన్‌ డోస్‌ను కూడా పెంచేలా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు టీమ్‌. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న ‘చార్లీచాప్లిన్‌ 2’ చిత్రంలో అదా శర్మ ఒక కథానాయికగా నటిస్తున్నారు. నిక్కీగల్రానీ మరో కథానాయిక.

మరిన్ని వార్తలు