సోల్‌మేట్‌ కోసం తపన!

17 Feb, 2018 02:16 IST|Sakshi
అదా శర్మ

బుధవారం వేలంటైన్స్‌ డే. సోలోగా ఉన్నవారికి సోల్‌మేట్‌ దొరికితే ఫుల్‌ ఖుష్‌ అవుతారు. లేనివాళ్లు సోల్‌మేట్‌ని వెతికే పనిలో ఉంటారు. సింగిల్‌గా ఉన్న ‘హార్ట్‌ ఎటాక్‌’ గాళ్‌ అదా శర్మ కూడా తన సోల్‌మేట్‌ను వెతికే పనిలో బిజీగా ఉన్నారు. అతగాడు ఎప్పుడెప్పుడు కలుస్తాడా? అని తపన పడుతున్నారు. ఏంటీ.. అదా పెళ్లికి తొందరపడుతున్నారా? అంటే కాదు. సోల్‌మేట్‌ను వెతుకుతున్నది రియల్‌లైఫ్‌లో కాదు. రీల్‌ లైఫ్‌లో. రెండేళ్ల క్రితం ‘క్షణం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన అదా వేలంటైన్స్‌ డే రోజున ‘సోల్‌మేట్‌’ అనే చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు.

అబిర్‌సేన్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో అదా డ్యూయెల్‌ రోల్‌ చేయనున్నారు. ‘‘ఎంతో తపనతో సోల్‌మేట్‌ను వెతుక్కునే మోడ్రన్‌ గాళ్‌ క్యారెక్టర్‌లో నటించనున్నాను. ఇంకా మరిన్ని విషయాలు షేర్‌ చేసుకోవాలని ఉంది. కానీ అందుకు టైమ్‌ ఉంది’’ అన్నారు అదా శర్మ. తెలుగులో ఈ చిత్రంతో పాటు అటు తమిళంలో ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో అదా కథానాయికగా నటిస్తున్నారు. నిక్కీ గల్రానీ మరో కథానాయిక.

మరిన్ని వార్తలు