ఏడేళ్ల విరామం తరువాత..

27 Sep, 2015 13:33 IST|Sakshi
ఏడేళ్ల విరామం తరువాత..

బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఏడేళ్ల విరామం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నాడు. 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని మలుపు తిప్పిన ఆదిత్యచోప్రా, 2008లో షారూఖ్, అనుష్క శర్మ జంటగా రబ్నే బనాదే జోడి సినిమాను తెరకెక్కించారు. ఆ తరువాత యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రమే చూస్తూ వస్తున్నారు.

లాంగ్ గ్యాప్ తరువాత 'బేఫికర్' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు ఆదిత్య చోప్రా. తన తండ్రి బాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ యాష్ చొప్రా జయంతి సందర్భంగా ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాను లో బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తున్నట్టుగా తెలిపారు.