ఆదిత్య లాంటి సినిమాలు అరుదు

13 Nov, 2015 23:11 IST|Sakshi
ఆదిత్య లాంటి సినిమాలు అరుదు

బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘అబ్దుల్ కలాం స్ఫూర్తితో బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనీ, దేశాభివృద్ధికి వివిధ రంగాల పరిశోధనల్లో కూడా రాణించాలని చెప్పే చిత్రం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదిత్యలాంటి ప్రతిభ గల విద్యార్థులు ఉంటారని ఈ చిత్రంలో చూపించాం.

ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపునిచ్చాయి. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఐఏయస్ ఆఫీసర్లు మంచి కథాంశం అని అభినందించారు. ఆదిత్య లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి’’ అన్నారు.