ఎముకలు కొరికే చలిలో షూటింగ్

1 Mar, 2018 11:26 IST|Sakshi
‘గూఢచారి’ సినిమాలో అడివి శేష్‌

క్షణం సినిమాతో హీరోగా మంచి విజయం సాధించిన అడివి శేష్‌ ప్రస్తుతం గూఢాచారి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శశికిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తూ ఈ సినిమాకు అడివి శేష్‌ కథా కథనాలు అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్‌, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్స్ లో జరుగుతోంది.

మైనస్‌ డిగ్రీల చలిలో చిత్రయూనిట్‌ షూటింగ్‌ చేస్తున్నారు. షూటింగ్ లోకేషన్లు, అక్కడి వాతావరణానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నాడు అడివి శేష్‌. ఈ సినిమాతో 2013 మిస్‌ ఇండియా శోభితా ధూళిపాల టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు