ప్రేమ కోసమై...

26 May, 2015 00:46 IST|Sakshi
ప్రేమ కోసమై...

‘‘ప్రేమకథ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని హీరో మనోజ్ నందం అంటున్నారు. మానస్ ఆర్ట్స్ మూవీస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో రాజ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘అదరగొట్టు’.
 
 పాటల రికార్డింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తన ప్రేమ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని ఓ యువకుడి కథ ఇదనీ, టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమా హుషారుగా ఉంటుందనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏలూరి నాయుడు.