కబీర్‌ సింగ్‌ ఎఫెక్ట్‌.. రూ. 35 కోట్లా?

10 Jul, 2019 19:34 IST|Sakshi

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సామెత. మిగతా చోట్ల ఏమో గానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ సామెతను చక్కగా పాటిస్తారు. చేతిలో ఓ హిట్టు పడగానే పారితోషికం భారీగా పెంచేస్తారు నటీనటులు. తాజాగా ఈ సామెతను నిజం చేసే పనిలో పడ్డారట బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్. తెలుగులో భారీ విజయం సాధించిన అర్జున్‌ రెడ్డిని హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. షాహిద్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్‌ సింగ్‌ నిలిచింది.

ఈ సినిమా విజయంతో షాహిద్ కపూర్ తన పారితోషికాన్ని భారీగా పెంచారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరువాతి చిత్రం కోసం షాహిద్‌ ఏకంగా రూ. 35 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు​వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల సరసన షాహిద్‌ కూడా చేరతారు. కబీర్‌ సింగ్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ. 240 కోట్లు వసూలు చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు