చిన్న గ్యాప్‌ తర్వాత

1 Mar, 2020 05:00 IST|Sakshi

‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు అనూ ఇమ్మాన్యుయేల్‌. చిన్న గ్యాప్‌ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ లేటెస్ట్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ  సినిమా తెరకెక్కుతోంది. జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌ ఓ కథానాయిక. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్‌ని మరో హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌లో అనూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘సినిమాలో ఇద్దరి కథానాయి కలకూ ప్రాధాన్యముంటుంది. వేసవిలో సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది.

మరిన్ని వార్తలు