భారీ రేటుకు 'ఏజెంట్ సాయి' రీమేక్ హ‌క్కులు

23 Jul, 2020 14:36 IST|Sakshi

గ‌తేడాది భారీ బ‌డ్జెట్ సినిమాలు అంచ‌నాల‌ను అందుకోలేక‌పోగా త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు మాత్రం అపూర్వ విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నాయి. అందులో హీరో న‌వీన్ పొలిశెట్టి న‌టించిన "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"కు ప్ర‌త్యేక స్థానం ఉంది. థ్రిల్ల‌ర్‌, డిటెక్టివ్ త‌ర‌హాలో రూపు దిద్దుకున్న ఈ సినిమా మూస సినిమాలు చూస్తూ విసిగిపోయిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని ఇచ్చింది. దాదాపు కోటి రూపాయ‌ల‌తో నిర్మించిన ఈ సినిమా గ‌తేడాది జూన్ 21న విడుద‌ల‌వ‌గా‌ నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో హీరోగా ప‌రిచ‌య‌మైన‌ న‌వీన్ పొలిశెట్టి సినిమా మొత్తాన్ని వ‌న్ మ్యాన్ షోగా న‌డిపించారు. రాహుల్ యాద‌వ్ న‌క్క నిర్మించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్‌జే రూపొందించారు. త్వ‌ర‌లోనే దీనికి సీక్వెల్ తీయాల‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డారు స్వ‌రూప్‌. (హిందీకి హిట్‌)

కాగా ప్ర‌ముఖ క‌మెడియ‌న్ క‌మ్ హీరో సంతానం ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళంలో ఈ చిత్రం రీమేక్ కానుంద‌ని ఎప్ప‌టినుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ క‌న్ను ప‌డింది. ఈ సినిమా హిందీ రీమేక్ హ‌క్కులు 2 కోట్ల రూపాయ‌లకు అమ్ముడుపోయాయి. బ‌డ్జెట్ క‌న్నా రెట్టింపు డ‌బ్బులకు రీమేక్ హ‌క్కులు రేటు ప‌ల‌క‌డం విశేషం. రీమేక్‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారు? రీమేక్ హ‌క్కుల‌ను ఎవ‌రు సొంతం చేసుకున్నారు? అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే చిన్న సినిమాలైన విశ్వ‌క్‌సేన్ 'హిట్‌', ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహా 'మ‌త్తు వ‌ద‌ల‌రా' సినిమాలు కూడా బాలీవుడ్ రీమేక్‌ల దిశ‌గా అడుగులు ప‌డిన‌ విష‌యం తెలిసిందే. (‘ప్రభాస్‌-అమీర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలి’)

మరిన్ని వార్తలు