నవ్వించి, ఏడిపించే ఆత్రేయ

9 Jun, 2019 03:30 IST|Sakshi
స్వరూప్, నవీన్‌ పొలిశెట్టి, నాగ్‌ అశ్విన్, రాహుల్, ‘మధుర’ శ్రీధర్‌

నవీన్‌ పొలిశెట్టి, శృతిశర్మ జంటగా స్వరూప్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ‘మహానటి’ ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్‌ మాట్లాడుతూ–‘‘ఈ టైటిల్‌ ఆసక్తిగా ఉంది. నవీన్‌ మంచి నటుడు. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా నుంచి నవీన్‌తో పరిచయం ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే కామెడీ, థ్రిల్లర్‌ అంశాలు కనిపిస్తున్నాయి’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌.

‘‘ఏజెంట్‌ అనే పదం పక్కన ఇంగ్లీష్‌ పేర్లతో ఉన్న టైటిల్స్‌ చాలా ఉన్నాయి. అందుకే ఏజెంట్‌ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ టైటిల్‌ పెట్టాం. మొదట్లో నిర్మాత రాహుల్‌గారు కన్విన్స్‌ అవలేదు. టైటిల్‌ డిజైన్‌ చేశాక ఓకే అన్నారు. ఆత్రేయ, ప్రేక్షకుల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్‌ చేస్తాడు’’ అని స్వరూప్‌ రాజ్‌ అన్నారు. ‘‘నవీన్‌ లాంటి నటుణ్ణి, స్వరూప్‌ లాంటి డైరెక్టర్‌ని పరిచయం చేస్తుండటం హ్యాపీ. మా సినిమా అందర్నీ ఆలోచింప చేస్తుంది’’ అన్నారు రాహుల్‌ యాదవ్‌ నక్కా. ‘‘షార్ట్‌ ఫిలిమ్స్‌తో నటించిన నేను ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నా. ఈనెల 21న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు నవీన్‌ పొలిశెట్టి. సంగీత దర్శకుడు మార్క్‌ రాబిన్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కృపాటి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా