ఆత్రేయ వస్తున్నారు

3 Jun, 2019 01:22 IST|Sakshi
నవీన్‌ పొలిశెట్టి, శృతి శర్మ

నవీన్‌ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్‌ యాదవ్‌ నక్కా రూపొందించిన ఈ సినిమా ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ అందుకుంది. ఈనెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది.  నవీన్‌ ఈ చిత్రంలో డిటెక్టివ్‌ పాత్రలో నటించాడు. డిఫరెంట్‌ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మార్క్‌ కె.రాబిన్‌ సంగీతం, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు