ఏజెంట్‌ కంటిన్యూ అవుతాడు

7 Jul, 2019 00:29 IST|Sakshi
రాహుల్, నవీన్‌ పొలిశెట్టి, స్వరూప్‌

స్వధర్మ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై నవీన్‌ పొలిశెట్టి, శృతిశర్మ జంటగా స్వరూప్‌ ఆర్‌ ఎస్‌జె దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఈ సక్సెస్‌ మా టీమ్‌ రెండున్నరేళ్ల కష్టం. సినిమా రిలీజ్‌ వరకు ఫుల్‌ టెన్షన్‌ పడ్డాం. అసలు రెండు, మూడు థియేటర్స్‌ దొరుకుతాయో లేదో అనుకున్నాం. అయితే మా సినిమా 70 థియేటర్లలో విడుదలైంది.

విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెడుతున్నాం. విజయ్‌ దేవరకొండ మొదటి నుండి మమ్మల్ని సపోర్ట్‌ చేశారు. బన్నీ (అల్లు అర్జున్‌) ట్వీట్‌ చేయటంతో పాటు మమ్మల్ని పిలిచి ఓ అరగంట మాట్లాడారు. నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం మా దర్శకుడు స్వరూప్, నిర్మాత రాహులే’’ అన్నారు. స్వరూప్‌ మాట్లాడుతూ– ‘‘డిజిటల్‌ మాద్యమం పెరగిన తర్వాత కూడా మా సినిమా మూడో వారంలోకి రావటం ఆనందంగా ఉంది.

ఏజెంట్‌కు పార్ట్‌–2 ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. మేం ఉన్నంతకాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది’’  అన్నారు. రాహుల్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాపై చాలామందికి అపనమ్మకాలు ఉండేవి. వాటన్నింటినీ దాటుకొని ఈ రోజు సినిమా హిట్‌ అవటం హ్యాపీగా ఉంది. థియేటర్స్‌ అడిగినప్పుడు ఫస్ట్‌ షోకు తీసేసే సినిమాకు థియేటర్స్‌ ఎందుకు? అన్నారు. సినిమా తీయటం కంటే రిలీజ్‌ చేయటం కష్టం. రేపు రిలీజ్‌ అన్నప్పుడు కూడా టెన్షన్‌ పడ్డాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు