బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

7 Aug, 2019 10:31 IST|Sakshi

సౌత్‌ ముంబైలోని ఓ థియేటర్‌కు వెళ్లారు ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ సునీల్‌ శెట్టి కొడుకు అహన్‌ శెట్టి. ఇది పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ అహన్‌ శెట్టి వెళ్లింది సినిమా చూడటానికి కాదు. తన ఫస్ట్‌ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కావడానికి. తెలుగు హిట్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నారు అహన్‌ శెట్టి. ఈ చిత్రానికి మిలప్‌ లూద్రియా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ముంబైలో ప్రారంభమైంది. తొలుత థియేటర్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముస్సోరీలో మేజర్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. ఈ చిత్రంలో తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘‘ఒరిజినల్‌ సినిమా చూశాను. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు