సన్నీని దాటేసిన ప్రియా ప్రకాష్‌

13 Feb, 2018 14:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కంటిబాసలతో కుర్రకారును ఫిదా చేసిన మళయాళ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఆన్‌లైన్‌ హల్‌చల్‌ కొనసాగుతోంది. గూగుల్‌ సెర్చ్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా బాలీవుడ్‌ హాట్‌బ్యూటీ సన్నీలియోన్‌ను టాప్‌లో ఉండగా, తాజాగా సన్నీని ప్రియా ప్రకాష్‌ దాటేసింది. ఓ సాంగ్‌లో కన్నుమీటుతూ ప్రియా ప్రకాష్‌ చేసిన అభినయం సోషల్‌ మీడియాను ఊపేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఇంటర్‌నెట్‌ సంచలనంగా మారింది.

ప్రియా ధాటికి కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, దీపికా పదుకోన్‌లూ గూగుల్‌ సెర్చ్‌లో వెనుకపడ్డారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన 18 ఏళ్ల ప్రియా వైరల్‌ వీడియాలో కట్టిపడేసే ఎక్స్‌ప్రెషన్స్‌లో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. త్వరలో విడుదల కానున్న మళయాళం మూవీ ఒరు ఆధార్‌ లవ్‌లోని క్లిప్‌ ప్రియా పలికించిన హావభావాలతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు