మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌?

25 Sep, 2019 09:49 IST|Sakshi
ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టుగా చెబుతున్నఈ సినిమాలో నటించే దిగ్గజాలపై ఇప్పటికే పలు అంచనాలు అభిమానుల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  తాజా సంచలనం ఏమిటంటే  హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారట.

దక్షిణాది సూపర్‌స్టార్లు లీడ్‌ రోల్స్‌ పోషించనున్న 'పొన్నియిన్ సెల్వన్'  సినిమాలో ఐశ్యర్య తల్లీ కూతుళ్లుగా రెండు కీలక పాత్రల్లో అలరించనున్నారు. చోళరాజు పెరియా పజువేట్టరయ్యర్ భార్య నందిని, నందిని తల్లి మందాకిని దేవీ పాత్రలకు మణిరత్నం ఐషును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జీన్స్‌ సినిమాలో కవల అక్కా చెల్లెళ్లుగా ఆకట్టుకున్న ఐశ్యర్య ఈసారి తల్లీ కూతుళ్లుగా ఆకట్టుకోనున్నారన్నమాట. 

కార్తీ, విక్రమ్, మోహన్ బాబు, కీర్తి సురేష్ ఇప్పటికే ఈసినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం.  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ సినిమాని మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంలో రాసిన కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల ఆధారంగా  'పొన్నియిన్ సెల్వన్' తెరకెక్కుతోంది. ఇది చోళ రాజు రాజరాజ చోళుని కథను చెబుతుంది. పాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందనున్న ఈ సినిమా నవంబరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయంపై అధికారిక వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్‌ వెల్లడించే అవకాశం ఉంది. 

చదవండి : అడవుల్లో వంద రోజులు!

మరిన్ని వార్తలు