డబుల్‌ యాక్షన్‌

26 Sep, 2019 00:40 IST|Sakshi
ఐశ్వర్యా రాయ్‌

‘జీన్స్‌’ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ ద్విపాత్రాభినయం చేశారు. అయితే నటించింది ఒక్క పాత్రలోనే. రెండు పాత్రలూ చేసినట్టు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో మ్యాజిక్‌ చేశారు. కానీ ఈసారి నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’. తమిళ ఫేమస్‌ నవల ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ నెగటివ్‌ షేడ్స్‌లో కనిపిస్తారని తెలిసిందే.

తాజాగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. చోళుల నాశనాన్ని కోరుకునే రాణి నందినిగా ఐష్‌ నటిస్తారు. అలానే నందిని తల్లి మందాకిని అనే మూగ పాత్రలోనూ కనిపిస్తారట. ‘నా కెరీర్‌లోనే చాలెంజింగ్‌ సినిమా ఇది’ అంటూ ఐష్‌ ఈ సినిమా గురించి ఆల్రెడీ పేర్కొన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, నయనతార, కీర్తీ సురేశ్, అనుష్క, అమలా పాల్, పార్తిబన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది.

మరిన్ని వార్తలు