భారత బిగ్గెస్ట్‌ సీఈవోలు వారే : ఐశ్వర్య రాయ్‌

4 Aug, 2018 12:35 IST|Sakshi
ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌

న్యూఢిల్లీ : 'హౌజ్ వైఫ్' అనే పదం వినడానికి ఎంత తేలికగా ఉన్నా... ఆ బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసే ఉంటుంది. ఇంటి బాధ్యతల్ని ఎప్పడికప్పుడూ నెరవేరుస్తూ.. పిల్లలకు, భర్తకు, అత్తామామలకు ఎలాంటి లోటు రాకుండా రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంది మగాళ్లు హౌజ్‌ వైఫేగా అంటూ తేల్చి పడేస్తూ ఉంటారు. కానీ వారే కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరించే కంటే ఎక్కువ బాధ్యతలు వ్యవహరిస్తారట. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ కూడా ఒప్పుకున్నారు. భారత్‌లో అతిపెద్ద సీఈవోలు హౌజ్‌ వైఫ్‌లేనని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. తన తాజా సినిమా ఫన్నీ ఖాన్‌ ప్రమోట్‌ చేసుకోవడానికి ఓ డ్యాన్స్‌ షోలో పాల్గొన ఆమె ఈ ప్రకటన చేశారు. 

‘హౌజ్‌ వైఫ్‌లే భారత్‌లో అతిపెద్ద సీఈవోలు. వారికి మనం అత్యంత ఉన్నతమైన గౌరవం, ప్రశంస ఇవ్వాలి. మన దేశంలో, ప్రపంచంలో ఉన్న హౌజ్‌ వైఫ్‌లందరికీ ఎంతో గౌరవంతో, ప్రశంసతో చేతులెత్తి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు. ఐశ్వర్య రాయ్‌ చేసిన ఈ ప్రకటనకు, సింగర్‌ విశాల్‌ డాడ్లని కూడా మద్దతిచ్చారు. ఆ డ్యాన్స్‌ షోలో ఆయన కూడా జడ్జి. ఐశ్వర్య రాయ్‌ కూడా మిగతా హౌజ్‌వైఫ్‌ల మాదిరి ప్రపంచంలో అ‍త్యంత సుందరమైన మహిళల్లో ఒకరు అని విశాల్‌ కొనియాడారు. 

‘నా మ్యూజిక్‌ టూర్ల సమయంలో ఒకసారి అమితాబ్‌ జీ మమ్మల్ని డిన్నర్‌ పార్టీకి ఆహ్వానించారు. ప్రపంచంలో అత్యంత సుందరి అయిన ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ ఆమె స్వహస్థాలతో మాకు డిన్నర్‌ వడ్డించింది. ఆ పార్టీకి సిబ్బంది అంతా వెళ్లాం. ప్రతి ఒక్కరికీ ఆమెనే సర్వ్‌ చేసింది. మేము అందరం తిన్న తర్వాతనే, ఐశ్వర్య భోజనం చేసింది’ అని విశాల్‌ గుర్తు చేసుకున్నారు.  

ఐశ్వర్య తన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల తన ఆరేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్‌ ట్రిపులో పాల్గొనడమే. ఐశ్వర్య వర్క్‌ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన కూతురు కోసం కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తూ.. ఆరాధ్యతో కలిసి ఈఫిల్‌ టవర్‌, డిస్నీల్యాండ్‌ సందర్శించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి కూడా. 2007లో ఐశ్వర్య, అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్‌ 20న ఈ కపుల్‌ తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన లేటెస్ట్‌ మూవీ ఫన్నీ ఖాన్‌ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది.  నెక్ట్స్‌ తన భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్‌ నటించబోతున్నారు. 

మరిన్ని వార్తలు