అడవుల్లో వంద రోజులు!

25 Sep, 2019 02:52 IST|Sakshi

రాజుల ఆహార్యం గొప్పగా ఉంటుంది. అందుకే రాజుల కథలతో వచ్చే సినిమాల కోసం హీరోలు తమ లుక్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళ హీరోలు విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి తమ లుక్స్‌ను మార్చుకోబోతున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంతో కూడుకున్న నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో  విక్రమ్, ఐశ్వర్యారాయ్‌ నటించనున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్, కీర్తి సురేష్, అమలాపాల్‌  ప్రధాన పాత్రధారులనే  ప్రచారం జరుగుతోంది. అమితాబ్‌ బచ్చన్, మోహన్‌బాబు కూడా కీలక పాత్రలు చేయనున్నారని కోలీవుడ్‌ టాక్‌. సినిమాలోని రాజుల పాత్రకు తగ్గట్లు జుట్టు మీసాలు, గెడ్డాలు పెంచుకోమని మణిరత్నం ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారులకు చెప్పారట. ఆల్రెడీ విక్రమ్, కార్తీ వంటి నటులు ఈ పని స్టార్ట్‌ చేశారని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ నవంబరులో మొదలు కానుందని తెలిసింది. ముందుగా థాయ్‌ల్యాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట టీమ్‌. వంద రోజుల పాటు అక్కడి అడవుల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారని తెలిసింది.

మరిన్ని వార్తలు