భర్తే తన ఫేవరెట్‌ అంటున్న నటి

17 May, 2018 18:19 IST|Sakshi
ఐశ్వర్య - అభిషేక్‌ బచ్చన్‌ (ఫైల్‌ ఫోటో)

అందానికే అసూయ పుట్టించే అందగత్తే ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌. ఈ మాజీ ప్రపంచ సుందరిని ఇష్టపడని వారుండరు. ఆమెతో కలిసి ఒకసారైనా నటించాలని హీరోలు అందరూ కోరుకుంటారు. మరి ఇంతకు ఈ ముద్దుగుమ్మకు ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఇంకెవరు తన భర్త అభిషేక్‌ బచ్చనే. ఈ విషయాన్ని ఐష్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభినే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి సినిమాల్లో సాధారణ వ్యక్తిలాగే కన్పిస్తాడు. సూపర్‌స్టార్‌ కొడుకైనప్పటికి అభిషేక్‌లో ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే తనలో నాకు నచ్చిన విషయం. ఇప్పటికీ మా ఇద్దరితో సినిమాలు తీయడానికి దర్శకులు మంచి స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇద్దరం ఓ సినిమా చేయబోతున్నాం. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాన’ని ఐశ్వర్యరాయ్‌ తెలిపారు.

గతంలో వీరిద్దరూ ‘గురు’, ‘ఉమ్రావ్‌ జాన్‌’, ‘రావణ్‌’, ‘కుచ్‌ నా కహో’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఐష్‌ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకకు హాజరయ్యారు. తల్లీకూతుళ్లిద్దరూ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఐష్‌‌ ‘ఫ్యానే ఖాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెకు జోడీగా రాజ్‌కుమార్‌ రావ్‌, అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారు. మరోపక్క అభిషేక్‌ బచ్చన్‌ ‘మన్మర్జియా’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు