ఇద్దరు గొడవపడితే ఒకరు గెలుస్తారు అదే..

20 Nov, 2019 11:27 IST|Sakshi

‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్‌ ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఈజ్‌ ద రియల్‌ మ్యాచ్‌ అనేది ఉప శీర్షిక. ఎన్‌వి. నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై జి. శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్‌, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉన్నాయి. తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

  
‘ఇద్దరు గొడవపడితే ఒకరు గెలుస్తారు.. అదే ఇద్దరు కాంప్రమైజ్‌ అయితే ఇద్దరూ గెలుస్తారు, ఆటకు గొడవకు తేడా తెలియన మనుషులు ఎంత చదువు కుంటే మాత్రం ఏం లాభం, నీ లైఫ్‌లో చివరి వరకు ఉండేది కుస్తీ మాత్రమే.. సిద్దూ ఉండడు’అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా క్రీడాకారిణిగా కనిపించనున్న ఐశ్వర్యా.. కుస్తీతో పాటు ప్రేమలోనే గెలవడానికి పడే సంఘర్షణ హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక సంజయ్‌స్వరూప్, ప్రదీప్‌ రావత్, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు గిఫ్టన్‌ ఇలియాస్ సంగీతం అందిస్తున్నాడు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు