కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌

17 Sep, 2019 10:41 IST|Sakshi

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్‌ సుబ్బరాజ్‌ రజనీకాంత్‌తో పేట చిత్రాన్ని తెరకెక్కించి స్టార్‌ దర్శకుడిగా మారిపోయారు. ప్రస్తుతం నటుడు ధనుష్‌తో చిత్రం చేయనున్నారు. కాగా మరో పక్క నిర్మాతగానూ నవ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. తన స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ పతాకంపై షార్ట్స్‌ ఫిలింస్‌ను నిర్మించారు. తర్వాత వైభవ్, ప్రియాభవానీశంకర్, ఇందుజా నటించిన మేయాదమాన్‌ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం ప్రభుదేవాతో మెర్కూరీ చిత్రాన్ని చేశారు. 

తాజాగా నటి కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. స్టోన్‌బెంచ్‌ ఫిలింస్‌ పతాకంపై నటి ఐశ్వర్యారాజేష్‌ ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని మొదలెట్టారు. ఈ చిత్రం సోమవారం నీలగిరిలో ప్రారంభం అయ్యింది. కల్‌ రామన్, ఎస్‌.సోమశేఖర్, కల్యాణ్‌ సుబ్రమనియన్‌లు ఈ సినిమాకు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నదీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రోబర్టో సస్సారా ఛాయాగ్రహణం, ఆనంద్‌ జరాల్టిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

లేడీ ఓరింయంటెడ్‌ కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఐశ్వర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు